రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్(RAM) కు చెందిన రామోజీ పబ్లికేషన్స్ విభాగం ప్రతిభావంతులైన రచయితలకు, వారి రచనలను పాఠక ప్రపంచానికి పరిచయం చేయడానికి తద్వారా వారి స్థాయిని పెంచకోవడానికి వేదికను సమకూర్చుతోంది
మీరు కథా రచయితా ?
ఈ ప్రచురణ విభాగం ఉత్తమ ప్రమాణాలు కల కాల్పనిక రచనలకు ప్రచురణ,విక్రయాల్లో పూర్తి స్థాయి అందిస్తుంది. అలాగే రచయితలతో కలిసి పలు మార్గాల ద్వారా వైవిధ్యమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి పుస్తకాలను,ఆన్ లైన్ మార్గాల ద్వారా అసంఖ్యాక పాఠకులకు చేరేలా చూస్తుంది.
పారదర్శకత
యాజమాన్య ప్రతిఫలానికి (ప్రాఫిట్ షేరింగ్) సంబంధించి రచయితలకు ఎలాంటి ఆందోళనా లేకుండా, ఈ విభాగం పూర్తి పారదర్శకతతో పనిచేస్తుంది. ప్రచురణ, విక్రయ ఖర్చులను మాత్రమే తీసుకుని, మిగిలు మొత్తాన్ని రచయితకు అందజేస్తుంది.
ఏడు భాషల్లో ప్రచురణలు
ఈ విభాగం ఒక మహా యజ్ఞానికి తెర తీస్తోంది. మన దేశ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ, పాఠకులకు చెప్పాల్సిన కథా రత్నాలను వెలికి తీసి వారికి అందించే బృహత్ కార్యక్రమం ఇది. సమకాలీన జీవితానికి సంబంధించిన కాల్పనిక రచనలను పలు భాషల్లో.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ,బెంగాలీ, హిందీ భాషలలో ప్రచురించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచురణలు ఆయా ప్రాంతాల సాంప్రదాయతను, విశిష్టతలను ప్రపంచానికి చాటేవిగా ఉంటాయి.
సచేతనమైన సాహితీ సంస్కృతిని పెంపొందించడమే ప్రచురణ విభాగ ప్రధాన లక్ష్యం.
ఇంకెందుకు ఆలస్యం? ఇదే మంచి సమయం.
మీ కలానికి పదునుపెట్టండి, మీ రచనల ప్రచురణకు మా వేదికను ఉపయోగించుకోండి..
రండి .. మీ పుస్తకాన్ని మా ద్వారా ప్రచురించండి!!