లఘుచిత్రాలు సినిమారంగానికి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూ, నిరంతరం పరిణామం చెందే కథన వాహికలు. తక్కువ ఖరీదులో తేలిగ్గా లభ్యమవుతున్న సాంకేతికత ఇవాళ ప్రతి ఒక్కరూ వారి అభినివేశాన్ని వ్యక్తీకరించడానికి మార్గం దారి చూపుతోంది.
సృజనాత్మక కథకులు లఘుచిత్రాలను ఆశ్రయించడం రోజురోజుకీ పెరుగుతోంది. డిజిటల్ విస్ఫోటనం, సామాజిక మాధ్యమాల విస్తృతి నేడు చిత్రనిర్మాణంపై ఆసక్తి ఉన్నవారికి సరికొత్త అవకాశాలు అందిస్తున్నాయి. కాకపోతే వారికి కళను ప్రదర్శించడానికి ఒక వేదిక, గుర్తింపు, ప్రోత్సహించి వెన్నుతట్టే వారు కావాలి.
మీ సృజనాత్మక స్థాయిని, నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి అద్భుతమైన వేదిక రామోజీ లఘుచిత్ర వేడుక(RSF)
RSF ఈ పోటీ సృజనకారుల ఊహా శక్తిని ఉద్దీపింపజేస్తూ, వ్యక్తీకరణ హద్దులను విస్తరిస్తుంది.RAM నిర్వహించే లఘుచిత్ర ఉత్సవంలో భాగంగా ‘రామోజీ లఘుచిత్ర పోటీలు’ కూడా ఉంటాయి. ఈ పోటీలు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ, మరాఠీ, మలయాళం, కన్నడ భాషల్లో జరుగుతాయి. రామోజీ లఘుచిత్ర పోటీ విశ్వజనీనత ఉన్న, ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే, అనుసరణ లేని నూతన కథల ప్రయోగాలను ప్రోత్సహిస్తుంది.