భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అవసరమైన కొత్తతరం ప్రతిభావంతులను తయారు చేసే వేదికే ఈ రామోజీ అకాడెమీ ఆఫ్ మూవీస్. సినిమా నిర్మాణం, దర్శకత్వం, నటన, స్క్రీన్ రైటింగ్ వంటి రంగాలలో ఉచిత ఆన్ లైన్ కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది RAM. ఇక్కడే సినిమా ఔత్సాహికులకు కావాల్సిన సినిమా విజ్ఞానాన్ని, మెళుకువలను నేర్పి సినీపరిశ్రమకు సిద్ధం అయ్యేలా తర్ఫీదునిస్తారు. సినిమా, టెలివిజన్ లకు సంబంధించిన ప్రపంచ స్థాయి నాణ్యత కల కోర్సులను 7 భారతీయ భాషల్లో.. (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మరాఠీ , మలయాళం, బెంగాలీ)... అందిస్తోంది.
ఈ అకాడమీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రామోజీ గ్రూప్ లో ఒక భాగం . రామోజీ గ్రూప్ 60 సంవత్సరాలుగా ఉన్నత వ్యాపార – నిర్వహణ విలువలు, ముందు చూపుతో , అడుగిడిన ప్రతి రంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ పురోగమిస్తోంది.
సమాచార, వినోదం, సినిమా నిర్మాణం, ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా, ఎఫ్ఎం రేడియో, రిటైల్, ఆహారం, ఆర్ధిక సేవలు, పర్యాటకం మొదలైన రంగాల్లో సృజనాత్మక సేవలను అందిస్తోంది. సినిమా నిర్మాణానికి అవసరమైన సమగ్ర వసతులతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో కాంప్లెక్స్, సినిమా నిర్మాణ విద్య, ఆరోగ్య స్వస్థత వంటి రంగాలలో మెరుగైన సేవలను అందిస్తూ రామోజీ గ్రూప్ ముందుకు సాగుతోంది.
సృజన వేదిక
వర్ధమాన దర్శకులను ప్రోత్సహించి, వారి సృజనను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పడిన వేదికే రామోజీ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఈ కాంపిటీషన్ ని RAM నిర్వహిస్తోంది. ఈ పోటీ.. పాల్గొనే వారికి ప్రోత్సాహం లభించడమే కాక, వారిలో సృజనాత్మకతని, సమర్థతను పెంపొందిస్తుంది.
ఏ కథనైనా కళ్ళకు కట్టినట్టు చూపే ఊహా నైపుణ్యాలు మీకుంటే, సినిమా ప్రపంచంలోకి అడుగిడటానికి ఇదే సరైన సమయం.